ప్రజాసంకల్ప యాత్రలో ఆసక్తికర ఘటన.. జగన్ తో పెళ్లి దుస్తుల్లో సెల్ఫీ దిగిన కొత్తజంట!
- శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో పాదయాత్ర
- జగన్ ను కలుసుకున్న నవ వధూవరులు
- స్వయంగా ఫోన్ తో సెల్ఫీ దిగిన జగన్

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ముందుకు సాగుతున్న జగన్ ను ఓ కొత్త జంట కలిసింది. ఈ సందర్భంగా వధూవరులిద్దరూ జగన్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనతో కలిసి సెల్ఫీ దిగారు. ఈ సందర్భంగా స్మార్ట్ ఫోన్ అందుకున్న జగన్ స్వయంగా వారితో కలిసి సెల్ఫీ దిగారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.