జార్ఖండ్ 'ముద్దుల పండగ'కు బీజేపీ మోకాలడ్డు!
- ప్రతి సంవత్సరం జార్ఖండ్ లో పండగ
- గిరిజనులు ఆచారంగా భావిస్తూ కిస్ ఫెస్టివల్
- అనుమతి నిరాకరించిన బీజేపీ
ఆ వీడియోలు వైరల్ గా మారగా, అప్పటివరకూ వెలుగులోకి రాని ఈ వింత ఆచారం ప్రపంచానికి తెలిసి, పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ సంవత్సరం పండగ జరుపుకునేందుకు అనుమతించేది లేదని బీజేపీ స్పష్టం చేసింది. బహిరంగ ముద్దులు భారత సంప్రదాయం కాదని, అది చెడు సందేశాలు ఇస్తోందన్నది బీజేపీ వాదన.
దీంతో ఈ సంవత్సరం పండగ వద్దని జిల్లా ఎస్డీఓ జితేంద్ర కుమార్ అదేశాలు జారీచేయగా, గిరిజనులు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముద్దుల పోటీ తమ ఆచారంలో భాగమని, స్వచ్ఛంగా ప్రేమను వ్యక్త పరుచుకోవడం కోసమేనని ఎమ్మెల్యే అంటున్నారు.