Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భర్త చేత షూస్ తొడిగించుకున్న సాక్షీ ధోని... వైరల్ అవుతున్న ఫోటో!

  • భార్యతో కలసి షాపింగ్ కు వెళ్లిన ధోనీ
  • షూస్ కొనుక్కోగా, కాళ్లకు తొడిగిన ధోనీ
  • ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజన్లు
తన సహచరులంతా ఆస్ట్రేలియాతో క్రికెట్ మ్యాచ్ లు ఆడుతూ బిజీగా ఉన్న వేళ, ఇండియాలో విశ్రాంతి తీసుకుంటున్న ధోనీ ఇటీవల తన భార్య సాక్షీ సింగ్ తో కలసి షాపింగ్ కు వెళ్లిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరుగగా, దానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చెప్పుల దుకాణంలో షూస్ పరీక్షించుకునే క్రమంలో ఇబ్బంది పడుతున్న సాక్షికి భర్త సహకరించాడు. కూర్చుని, ఆమె కాళ్లకు అవి సరిపోయాయో లేదో స్వయంగా చూస్తూ కాళ్లకు తొడిగాడు.. అతనే స్వయంగా చెప్పుల బెల్టులు సర్దాడు. ఈ ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేసిన సాక్షి, "బిల్లు నువ్వే కట్టావుగా... షూస్‌ కూడా నువ్వే వేయ్యి" అని కామెంట్‌ చేసింది.  షాప్‌ లో అందరి ముందూ భేషజాలు లేకుండా తన భార్యకు ధోనీ చేసిన సాయాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా, వచ్చే సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్ కు ఎంపికైతే ఆస్ట్రేలియా వెళ్లి, జనవరి 12న జరిగే మ్యాచ్ లో ధోనీ ఆడనున్నాడు.
MS Dhoni
Sakshi Singh
Shoes
Chappal
Instagram

More Telugu News