చరిత్ర సృష్టించిన పీవీ సింధు!
- వరల్డ్ టూర్ ఫైనల్స్ లో విజయం
- ఒకుహరాతో తలపడిన సింధు
- 21-19, 21-17 తేడాతో గెలుపు
తొలి సెట్ ను 21-19 తేడాతో గెలిచిన ఆనందంలో రెండో సెట్ ను ప్రారంభించిన సింధూ, ఒకదశలో ఒకుహరాతో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. రెండో సెట్ ను 21-17 తేడాతో గెలుచుకుని టైటిల్ ను నెగ్గింది. ఈ విజయంతో సీజన్ ముగింపు టోర్నమెంట్ లో విజేతగా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధూ రికార్డు నెలకొల్పింది.