రూ.118 కోట్ల పన్ను ఎగవేసిన పాప్ సింగర్ షకీరా
- షకీరాపై పన్ను ఎగవేత ఆరోపణలు
- 11 నెలల క్రితమే విచారణకు ఆదేశం
- బార్సెలోనాకు మకాం మార్చిన పాప్ సింగర్
2012 నుంచి 2014 వరకు షకీరా బార్సెలోనాలోనే నివసించింది. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన షోల ద్వారా సంపాదించిన మొత్తంలో పన్ను కట్టాల్సి ఉందని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు. షకీరా ఎక్కువ కాలం స్పెయిన్లో ఉందని, విదేశాల్లో అతి తక్కువ సమయం మాత్రమే ఉందని తెలిపారు. షకీరాపై నమోదైన అభియోగాలపై స్పందించేందుకు ఆమె ప్రతినిధులు నిరాకరించారు. షకీరా పన్ను ఎగవేత ఆరోపణలపై 11 నెలల క్రితమే న్యాయాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. తాజాగా అభియోగాలు నమోదయ్యాయి.