Telangana: కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం.. ఓటమిపై చర్చ

  • తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాజయం
  • 19 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్
  • ఈవీఎంల టాంపరింగ్‌పై చర్చ
ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమి ఘోర పరాజయం పాలైంది. కేవలం 21 స్థానాలకు, అందులోనూ కాంగ్రెస్ 19 స్థానాలకు పరిమితమైంది. అయితే ఈ ఓటమిపై సమీక్ష నిర్వహించేందుకు నేడు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో సమావేశమయ్యారు.

టీడీపీతో జత కట్టడం వలన కలిగిన లాభ నష్టాలు, ఈవీఎంల ట్యాంపరింగ్ తదితర అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం. ఈ సమీక్ష సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రమేశ్ రాథోడ్, సునీతా లక్ష్మారెడ్డి, పొన్నం ప్రభాకర్, దాసోజు శ్రవణ్, ఆరేపల్లి మోహన్ తదితరులు హాజరయ్యారు.    
Telangana
Congress
Jana Reddy
Uttam Kumar Reddy
Dasoju Sravan
Sunitha Lakshma Reddy

More Telugu News