Kala venkat Rao: కేసీఆర్‌కు మద్దతివ్వడం సిగ్గుగా అనిపించట్లేదా?: జగన్‌పై కళా వెంకట్రావు ధ్వజం

  • మద్దతు ఇవ్వడమంటే ప్రజలను వంచించడమే
  • అన్యాయం చేయడమే రహస్య అజెండానా?
  • టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ కు ధన్యవాదాలు చెప్పడమేంటి?
తెలంగాణలో టీఆర్ఎస్‌‌కు మద్దతిచ్చారంటూ వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన జగన్‌కు బహిరంగ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్న కేసీఆర్‌కు మద్దతివ్వడమేంటని లేఖలో ధ్వజమెత్తారు.

టీఆర్ఎస్‌కు మద్దతివ్వడమంటే ఏపీ ప్రజలను వంచించడమేనని.. ఏపీకి అన్యాయం చేయడమే వైసీపీ రహస్య అజెండానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్‌పల్లిలో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి జగన్ కు ధన్యవాదాలు తెలుపుతూ బహిరంగ ప్రకటన చేయడాన్ని ఆయన ప్రస్తావించారు. హోదాకు అడ్డుపడ్డ టీఆర్ఎస్‌కు మద్దతుగా నిలవడమేంటని లేఖలో ప్రశ్నించారు.
 
Kala venkat Rao
Jagan
TRS
KCR
Kukatpally
Telangana

More Telugu News