kcr: పార్టీ బలోపేతం కోసమే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించా: కేసీఆర్

  • ముగిసిన టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం
  • పార్టీకి కేటీఆర్ పూర్తి సమయం కేటాయిస్తారు
  • వందేళ్లు వర్థిల్లేలా పార్టీని ప్రజల్లో ఉంచాలి
టీఆర్ఎస్ రాష్ట్ర కార్య వర్గ సమావేశం ముగిసింది. పంచాయతీ ఎన్నికలు, పార్టీ బలోపేతంపై కార్యవర్గం చర్చించింది. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ నియామకానికి కార్యవర్గం ఆమోదం తెలిసింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసమే కేటీఆర్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించామని చెప్పారు.

రేపటి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ అందుబాటులో ఉంటారని, పార్టీకి ఆయన పూర్తి సమయం కేటాయిస్తారని చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి పెట్టాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలు తమపై పెట్టిన బాధ్యతను ప్రతి ఒక్కరూ సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో పార్టీ కార్యాలయం ఏర్పాటు కావాలని, వందేళ్లు వర్థిల్లేలా పార్టీని ప్రజల్లో ఉంచాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
kcr
KTR
TRS
Telangana
Hyderabad

More Telugu News