NTR: 'ఎన్టీఆర్'లో చంద్రబాబుగా రానా ఇలా..!

  • క్రిష్ దర్శకత్వంలో 'ఎన్టీఆర్'
  • చంద్రబాబునాయుడి పాత్రలో నటిస్తున్న రానా
  • రెండు పోస్టర్లు విడుదల
క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న 'ఎన్టీఆర్' బయోపిక్ 'కథానాయకుడు', 'మహానాయకుడు' చిత్రాల్లో అత్యంత కీలకమైన చంద్రబాబునాయుడి పాత్రలో రానా నటిస్తున్న సంగతి తెలిసిందే. రానా పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానుల కోసం రానా కనిపిస్తున్న రెండు పోస్టర్లను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే రానా సినిమా షూటింగ్ కు సంబంధించి తన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నాడు. చంద్రబాబుగా కనిపిస్తున్న రానా ఫ్యాన్స్ ను ఆకర్షిస్తున్నాడు. ఆ పోస్టర్లను మీరూ చూడవచ్చు.






NTR
Balakrishna
Rana
Posters

More Telugu News