Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ!

  • హరిప్రియకు టికెట్ ఇప్పించిన రేవంత్ రెడ్డి
  • ఆమె గెలుపు కోసం ప్రచారం చేసిన రేవంత్
  • కృతజ్ఞతలు చెప్పిన హరిప్రియ
తన రాజకీయ గురువు, ఇల్లెందు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిన తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే బానోతు హరిప్రియ కలిశారు. తనకు టికెట్ ఇప్పించినందుకు, తనకు ఓట్లు వేయాలని ప్రజలను కోరుతూ ప్రచారం చేసినందుకు రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్‌ లోని రేవంత్ గృహానికి తన అనుచరులతో కలసి వచ్చిన ఆమె, ఆపై మాట్లాడుతూ,  మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిశానని అన్నారు. తన విజయానికి ఆయనెంతో కృషి చేశారని చెప్పారు. హరిప్రియతో పాటు ఇల్లెందు మండల కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కాగా, ఈ ఎన్నికల్లో తన శిష్యురాలు హరిప్రియ విజయం సాధించగా, రేవంత్ మాత్రం ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 
Revanth Reddy
Haripriya
Yellendu

More Telugu News