వైరల్ అవుతున్న కెమిస్ట్రీ మేడం శుభలేఖ.. శశిథరూర్ సరదా స్పందన
- వెరైటీగా పెళ్లి శుభలేఖను డిజైన్ చేసిన కెమిస్ట్రీ టీచర్
- సోషల్ మీడియాలో వైరల్
- జీవితంలో ఉష్ణానికి చోటివ్వద్దంటూ థరూర్ ట్వీట్
ఈ శుభలేఖను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో టీచర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు. వైరల్ అయిన ఈ శుభలేఖను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా అంతే సరదాగా స్పందించారు. కొత్త జంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూనే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మెరుపుల్లా వెదజల్లాలని, ఫిజిక్స్‌లో ఉండే ఉష్ణానికి చోటివ్వకుండా, మీ జీవితంలో కాంతి మెరవాలని, దాని ఫలితం బయాలజీలా ఉండాలని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.