Telangana: తెలంగాణ హోం మంత్రిగా మహమూద్ అలీ

  • ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు  
  •  గత కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న అలీ
  •  నాడు హోం మంత్రిగా ఉన్న నాయిని
తెలంగాణ హోం శాఖను మంత్రి మహమూద్ అలీకి కేటాయించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గత కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా మహమూద్ అలీ రెవెన్యూ శాఖను నిర్వహించారు. మహమూద్ అలీ ఈరోజు కేసీఆర్ తో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు.

కాగా, సీఎం కేసీఆర్ కి సన్నిహితుడైన మహమూద్ అలీకి రెండో పర్యాయంలోనూ కీలక మంత్రిత్వ శాఖ దక్కినట్టయింది. ఈసారి మంత్రి వర్గంలో గణనీయమైన మార్పులు ఉంటాయని, కొత్త వారికి అవకాశముంటుందని సమాచారం. గత కేబినెట్ లో హోం శాఖను నాయిని నర్సింహారెడ్డి నిర్వహించారు.
Telangana
home ministry
mahamood ali

More Telugu News