amaravathi: నీరుకొండలో ఎన్టీఆర్ విగ్రహాన్ని రాగితో నిర్మిస్తాం: మంత్రి నారాయణ

  • మరో మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తాం
  • హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి
  • ఈ నెల 31కి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు
ఏపీ రాజధాని అమరావతిలోని నీరుకొండపై దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మెమోరియల్ ను అద్భుతంగా నిర్మించనున్నామని, ఎన్టీఆర్ విగ్రహాన్ని రాగితో నిర్మిస్తామని ఏపీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. మరో మూడు నెలల్లో పనులు ప్రారంభిస్తామని అన్నారు. అమరావతిలో నిర్మిస్తున్న హైకోర్టు పనులను ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, హైకోర్టు నిర్మాణ పనుల గురించి ఆయన మాట్లాడుతూ, పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఈ నెల 31కి నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు చేపడతామని చెప్పారు. ప్రజలకు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణపనులు పదహారు వందల కిలోమీటర్ల మేరకు పూర్తయ్యాయని అన్నారు.

15 నుంచి అమరావతి సందర్శనకు అవకాశం

ఈ నెల 15 నుంచి ప్రజాప్రతినిధులకు, విద్యార్థులకు రాజధాని అమరావతి సందర్శనకు అవకాశం కల్పిస్తున్నామని నారాయణ పేర్కొన్నారు. రోజుకు 25 బస్సుల్లో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
amaravathi
neerukonda
minsiter
narayana

More Telugu News