Damodara Rajanarsimha: కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహపై టీడీపీ నేత అభిషేక్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

  • మహాకూటమి ఓటమికి దామోదరే కారణం
  • మెదక్ జిల్లా టికెట్లను అమ్ముకున్నారు
  • ఆందోల్ ఇన్‌చార్జి పదవి నుంచి తప్పించండి
తెలంగాణలో మహాకూటమి ఓటమికి కారణం కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహేనని టీడీపీ నేత అభిషేక్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దామోదర స్వార్థ రాజకీయాలు మహాకూటమి కొంప ముంచాయని ఆరోపించారు. మెదక్ జిల్లాలో ఆయన టికెట్లను అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన అభిషేక్.. దామోదరను వెంటనే ఆందోల్ ఇన్‌చార్జ్ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో టీడీపీతో పొత్తే కాంగ్రెస్ కొంప ముంచిందని విజయశాంతి సహా పలువురు నేతలు ఆరోపిస్తుంటే అభిషేక్ మాత్రం మహాకూటమి ఓటమికి దామోదర కారణమంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగించాయి. అయితే, జానారెడ్డి వంటి సీనియర్ నేతలు మాత్రం కాంగ్రెస్ ఓటమికి టీడీపీ కారణం కాదని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసినప్పటికీ కాంగ్రెస్‌ను ప్రజలు ఇంకా ఆదరించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.
Damodara Rajanarsimha
Congress
abhishek goud
Telugudesam
Medak District

More Telugu News