KCR: ఓటుకు నోటు కేసు ప్రాసెస్‌లోనే ఉంది: కేసీఆర్

  • విపక్షాలకు హెచ్చరికలు జారీ
  • ఓటుకు నోటు కేసు ప్రస్తావన
  • చిన్నచిన్న లోపాలతో చాలా సీట్లు కోల్పోయామన్న కేసీఆర్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు కథ ముగిసిపోలేదని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న కేసీఆర్ అన్నారు. అదింకా ప్రాసెస్‌లోనే ఉందన్నారు. ఈసారి ఎవరైనా ఎక్కువ చేస్తే ఊరుకోబోమని, తగిన ట్రీట్‌మెంట్ ఇచ్చి తీరుతామంటూ విపక్షాలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్షాలు అడ్డగోలుగా మాట్లాడడాన్ని మానుకోవాలన్నారు. ఈసారి మాత్రం ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. ఎవరెవరు ఎంతంత మేశారో చూసి మొత్తం కక్కిస్తామన్నారు. తాజా ఎన్నికల్లో నిజానికి టీఆర్ఎస్ 106 స్థానాల్లో గెలవాల్సి ఉందని, చిన్నచిన్న లోపాల వల్ల చాలా సీట్లను కోల్పోయామని కేసీఆర్ పేర్కొన్నారు.  కాగా, ఓటుకు నోటు కేసును కేసీఆర్ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది.
KCR
Telangana
Note to Vote
Chandrababu
Andhra Pradesh

More Telugu News