మూడు భాషల్లో సిద్ధమవుతోన్న 'మణికర్ణిక'
- చారిత్రక చిత్రంగా 'మణికర్ణిక'
- ఈ నెల 18వ తేదీన ట్రైలర్ రిలీజ్
- వచ్చేనెల 25న సినిమా విడుదల
ఈ సినిమాను హిందీతోపాటు తెలుగు .. తమిళ భాషల్లో జనవరి 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకి చాలావరకూ క్రిష్ దర్శకత్వం వహించగా, ఆ తరువాత దర్శకత్వ బాధ్యతలను కంగనానే చూసుకుంటూ వస్తోంది. శంకర్ .. ఎహసాన్ .. లాయ్ .. సంగీతం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే ఆశాభావంతో కంగనా వుంది.