బీజేపీ అందుకే ఓడింది.. ఆ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
- బీజేపీ ఓటమిని ముందే ఊహించా
- అభివృద్ది హామీని ప్రభుత్వం మర్చిపోయింది
- నగరాల పేర్ల మార్పు, విగ్రహాల ఏర్పాటుపైనే దృష్టి పెట్టింది
రాజస్థాన్, చత్తీస్‌గఢ్ లలో ఓటమి తప్పదని తనకు ముందే తెలుసని, కానీ మధ్యప్రదేశ్‌లలోనూ కాంగ్రెస్ పైచేయి సాధించడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. అభివృద్ధి చేస్తామన్న హామీతో 2014లో మోదీ అధికారంలోకి వచ్చారని, కానీ పార్టీ ఇప్పుడా హామీని మర్చిపోయిందని సొంత పార్టీ పైనే విమర్శలు చేశారు. రామ మందిర నిర్మాణం, విగ్రహాల నిర్మాణం, నగరాల పేర్ల మార్పుపైనే పార్టీ దృష్టి సారించిందని, ఈ ఎన్నికల్లో అదే కొంప ముంచిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.