Nandamuri suhasini: సుహాసిని పరాజయంతో నందమూరి కుటుంబంలో పెరిగిన ఓటముల సంఖ్య!
- ఇప్పటి వరకు నలుగురు ఓటమి
- గతంలో ఎన్టీఆర్, జయకృష్ణ, హరికృష్ణ పరాజయం
- కూకట్‌పల్లిలో సుహాసిని పరాజయం
తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కూకట్‌పల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన నందమూరి సుహాసిని ఓటమి పాలయ్యారు. ఆమె ఓటమితో నందమూరి కుటుంబంలో ఓటముల సంఖ్య నాలుగుకు పెరిగింది. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు, ఆయన కుమారుడు జయకృష్ణ, హరికృష్ణ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు సుహాసిని కూడా ఓడిపోయారు.
1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీరామారావు అనంతపురం జిల్లా హిందూపురం, మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి నుంచి పోటీ చేశారు. హిందూపురంలో ఆయన విజయం సాధించగా, కల్వకుర్తిలో ఓటమి పాలయ్యారు. 1996లో ఎన్టీఆర్ మరణం తర్వాత ఆయన భార్య లక్ష్మీపార్వతి ‘ఎన్టీఆర్ తెలుగుదేశం’ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ టికెట్‌పై ఎన్టీఆర్ కుమారుడు జయకృష్ణ శ్రీకాకుళం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
1999లో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ ‘అన్న తెలుగుదేశం’ పార్టీని స్థాపించి గుడివాడ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. తాజాగా హరికృష్ణ కుమార్తె సుహాసిని కూకట్‌పల్లిలో ఓటమి పాలయ్యారు. దీంతో నందమూరి కుటుంబంలో ఇప్పటి వరకు ఓడిన వారి సంఖ్య 4కు పెరిగింది.