Andhra Pradesh: టీఆర్ఎస్ గెలుపుతో ఏపీలోనూ పండుగ.. కేటీఆర్ ఫ్లెక్సీకి జనసేన కార్యకర్తల పాలాభిషేకం

  • తెలంగాణలో టీఆర్ఎస్ సంబరాలు
  • ఏపీలోజనసేన కార్యకర్తల హంగామా
  • టీడీపీ వ్యతిరేక నినాదాలు
తెలంగాణలో టీఆర్ఎస్ ఘన విజయంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగితేలుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లోనూ పండుగ చేసుకుంటున్నారు. టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీలు బాణసంచా కాల్చి సంబరాల్లో మునిగిపోయాయి. మరోవైపు, అమరావతి ప్రాంతానికి చెందిన జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ గెలుపును పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యతిరేక నినాదాలు చేశారు. అనైతిక రాజకీయాలు నశించాలంటూ పెద్ద ఎత్తున నినదించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో జనసేన కార్యకర్తలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు.
Andhra Pradesh
Amaravathi
Jana sena
TRS
KTR

More Telugu News