Telangana: 70 ఏళ్లు దరిద్ర పాలన అనుభవించారు: శ్రీనివాస గౌడ్

  • 1978లో లాగే చేద్దామనుకున్నారు
  • కూటమి గాలికి కొట్టుకుపోయింది
  • రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
తెలంగాణ ప్రజలు 70 ఏళ్లు దరిద్ర పాలన అనుభవించారని మహబూబ్‌నగర్‌లో విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధి ముందు కూటమి గాలికి కొట్టుకుపోయిందని వ్యాఖ్యానించారు.

1978లో ఎలా చేశారో ఇప్పుడు కూడా అలానే చేద్దామనుకున్నారని, కానీ కుదరలేదని అన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు బాగా నచ్చినందునే మళ్లీ పట్టం కట్టారన్నారు. కూటమి నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.
Telangana
Srinivasa Goud
TRS
KCR

More Telugu News