KCR: కేసీఆర్... ఇది మీకే సంభవం!: మోహన్‌బాబు

  • కేసీఆర్ గెలవాలని భగవంతుడిని కోరా
  • దేవతలు తథాస్తు అన్నారు
  • అనితర సాధ్యమైన విజయాన్ని అందించారు
ఎన్నికలకు ముందు కేసీఆర్ గెలవాలని ఫిలింనగర్ దైవసన్నిధానంలో కోరుకున్నానని ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు తెలిపారు. నేడు తెలంగాణ ఎన్నికల ఫలితాలలో 88 స్థానాలను దక్కించుకుని టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది.

ఈ సందర్భంగా మంచు మోహన్‌బాబు ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికలకు ముందు ఫిలింనగర్ దైవ సన్నిధానం ప్రాంగణంలో కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాను. దేవతలు తథాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన, అనితర సాధ్యమైన విజయాన్ని అందించారు. కేసీఆర్, ఇది మీకే సంభవం.. మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
KCR
Mohan babu
TRS
Telangana

More Telugu News