janareddy: ప్రజా కూటమి ఓటమికి గల కారణాలపై సమీక్షిస్తాం: జానారెడ్డి

  • కేసీఆర్ కు అభినందనలు తెలియజేస్తున్నా
  • ఎన్నికలు అన్నప్పటి నుంచి అవకతవకలు జరిగాయి
  • మా పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
తెలంగాణలో ప్రజాకూటమి ఓటమిపాలు కావడంపై సమీక్షించి, మీడియాకు తెలియజేస్తామని కాంగ్రెస్ తరఫున నాగార్జున సాగర్ లో పోటీ చేసి ఓటమి పాలైన జానారెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దేశ, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యాతోనే టీడీపీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని, అది అధిష్ఠానం నిర్ణయమని అన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న కేసీఆర్ కు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. ఇదే సందర్భంలో ఎన్నికలు అన్నప్పటి నుంచి జరిగిన అవకతవకలను గుర్తుచేస్తున్నానని అన్నారు. ఓట్ల తొలగింపు, ఓట్లు చేర్చడంలో జరిగిన అవకతవకలు, ఓటు హక్కు ఉండి కూడా జాబితాలో లేకపోవడం వంటి విషయాలు చాలా అగమ్యంగా ఉన్నాయని అన్నారు. ఈ విషయమై ఈసీకి తమ పార్టీ తరపున అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం తీవ్రమైన విషయమని అన్నారు.
janareddy
congress
kcr
election commission

More Telugu News