Jagan: అపవిత్ర కూటమిని తిరస్కరించారు: టీఆర్ఎస్ విజయంపై జగన్ ట్వీట్

  • ట్విట్టర్ ద్వారా స్పందించిన జగన్
  • కేసీఆర్‌ గారికి శుభాకాంక్షలు 
  • ప్రభుత్వంపై నమ్మకంతో మరోసారి గెలిపించారు
ఈ నెల 7న ఎన్నికలు జరిగిన నాటి నుంచి రాష్ట్రంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నేడు కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచే టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోయింది. తుది ఫలితాల్లో కూడా కారు జోరును ప్రదర్శించడమే కాకుండా క్లీన్ స్వీప్ చేసేసింది. టీఆర్ఎస్ సాధించిన అఖండ విజయంపై సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు.

కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా వైసీపీ అధినేత జగన్ కేసీఆర్‌కు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘‘కేసీఆర్‌ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతరుల అపవిత్ర కూటమిని ప్రజలు తిరస్కరించారు’’ అని జగన్ ట్వీట్‌లో పేర్కొన్నారు.
 
Jagan
TRS
KCR
Telangana
Twitter

More Telugu News