కేటీఆర్... రాబోయే ఐదేళ్లకు ఆల్ ది బెస్ట్: ఒమర్ అబ్దుల్లా

  • క్లీస్ స్వీప్ దిశగా టీఆర్ఎస్
  • తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
  • కేటీఆర్ ను అభినందించిన ఒమర్ అబ్దుల్లా
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా వెలువడుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఫలితాల రూపంలో వెల్లడవుతోంది. క్లీన్ స్వీప్ దిశగా టీఆర్ఎస్ కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 'థ్యాంక్స్ తెలంగాణ. కేసీఆర్ గారిపై నమ్మకం ఉంచినందుకు, మీకు మరోసారి సేవ చేసే అవకాశం కల్పించినందుకు' అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రిప్లై ఇచ్చారు. 'కంగ్రాచ్యులేషన్స్. రానున్న ఐదేళ్లకు ఆల్ ది బెస్ట్' అంటూ కేటీఆర్ ను అభినందించారు.
Go Back to Shorts
kcr
KTR
TRS
omar abdullah
national conference

More Telugu News