Congress: తెలంగాణలో తొలి ట్రెండ్స్ ఇవే!

  • పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ ఆధిక్యం
  • వెల్లడవుతున్న ట్రెండ్స్
తెలంగాణలో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ మొదలయ్యాయి. తొలి ట్రెండ్స్‌లోనే పోటీ బయటపడింది. కాంగ్రెస్-టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ తప్పదని తేలిపోయింది. ఇప్పటి వరకు వెల్లడైన పోస్టల్ బ్యాలెట్లలో కారు, హస్తం ఒక్కో స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. మరోవైపు, దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్ జోరు కొనసాగే అవకాశం ఉన్నట్టు ట్రెండ్స్ ద్వారా తెలుస్తోంది.

రాజస్థాన్‌లో కాంగ్రెస్ 5, చత్తీస్‌గఢ్‌లో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. విజయంపై బీజేపీ ఆశలు పెట్టుకున్న మధ్యప్రదేశ్‌లోనూ కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 3 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక, తెలంగాణలోని మక్తల్‌లో మొత్తం 1228 పోస్టల్ ఓట్లు ఉండగా టీఆర్ఎస్ 117 ఓట్ల ఆధిక్యంలో ఉంది. సిరిసిల్లలోనూ పోస్టల్ బ్యాలెట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది.
Congress
Telangana
Telugudesam
TRS
Madhya Pradesh
Rajasthan
Chhattisgarh

More Telugu News