17 గంటలపాటు కొనసాగిన ఎన్ కౌంటర్.. ముగ్గురు ముష్కరులను కాల్చి చంపిన జవాన్లు
- శ్రీనగర్ శివార్లలోని గ్రామంలో ఎన్ కౌంటర్
- గాయపడ్డ ఐదుగురు జవాన్లు
- చనిపోయిన ఉగ్రవాదులు లష్కరే తాయిబాకు చెందిన వారిగా గుర్తింపు
ఈ క్రమంలో వారిపై టెర్రరిస్టులు కాల్పులను ప్రారంభించారు. వీరికి దీటుగా భద్రతా బలగాలు కూడా కాల్పులు మొదలెట్టాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ముష్కరులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి. ఇదే సమయంలో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. ఎన్ కౌంటర్ లో చనిపోయిన ఉగ్రవాదులను లష్కరే తాయిబాకు చెందిన వారిగా గుర్తించారు. ఘటనాస్థలిలో వారికి సంబంధించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.