Andhra Pradesh: ఆంధ్రాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు భారీ పోటీ.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య 3.38 లక్షలు!

  • ఒక్కో ఖాళీకి 142 మంది పోటీ
  • జనవరి 6న ప్రిలిమినరీ పరీక్ష
  • నిన్నటితో ముగిసిన దరఖాస్తు గడువు
పోలీస్ శాఖలో 2,723 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా, నిన్నటితో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగిసింది. ఈ విషయమై పోలీస్ శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందించారు.

ఏపీలో ఒక్కో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఈసారి ఏకంగా 142 మంది పోటీ పడుతున్నట్లు తెలిపారు. సివిల్‌, ఏఆర్‌, ఏపీఎస్పీ విభాగాల్లో కానిస్టేబుళ్లు, ఫైర్‌మెన్‌, జైలువార్డెన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీచేశామని వెల్లడించారు. నిన్న సాయంత్రం 5 గంటల నాటికి మొత్తం 3.38 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ పోస్టులకు వచ్చే ఏడాది జనవరి 6న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..
సివిల్ కానిస్టేబుల్ 1600
ఏఆర్ కానిస్టేబుల్ 300
ఏపీఎస్పీ కానిస్టేబుల్ 300
ఫైర్ మెన్ 400
జైలు వార్డెన్ 123
Andhra Pradesh
Police
constable
recruitment

More Telugu News