ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డాను: నితిన్ గడ్కరీ
- ఆక్సిజన్ అందక ఇబ్బందికి గురయ్యాను
- ఆ తర్వాత షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయాయి
- నేను కోలుకోవాలని కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు
చికిత్స అనంతరం గడ్కరీ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని... ఎవరూ ఆందోళన చెందవద్దని ఆయన తెలిపారు. శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకపోవడంతో ఇబ్బందికి గురయ్యానని చెప్పారు. ఆ తర్వాత షుగర్, బీపీ లెవెల్స్ పడిపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యానని... ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో క్షేమంగానే ఉన్నానని చెప్పారు. తాను కోలుకోవాలని కోరుకున్న శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.