ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు... పోలింగ్ రోజు రెవెన్యూ కార్యాలయాల ముందు ఆందోళన
- చనిపోయిన వారి పేర్లుండి, బతికున్న వారి పేర్లు లేని జాబితా ఒకటి
- మరోచోట ఒకే గ్రామానికి చెందిన 1500 మంది ఓట్లు మాయం
- ఆయా ప్రాంతాల తహసీల్దార్లను నిలదీసిన బాధితులు
ఒకే గ్రామానికి చెందిన ఇంతమంది పేర్లు జాబితాలో లేకపోవడం ఏమిటని గ్రామస్థులు బిక్కనూరు ఎమ్మార్వోను నిలదీశారు. అలాగే, ఆర్మూర్ పట్టణ పరిధిలోని ఎల్లమ్మగుట్ట ప్రాంతానికి చెందిన ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లు ఉండడం, బతికున్న వారి పేర్లు లేకపోవడంతో స్థానికులు ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
చెన్నూరు ఓటరు లిస్టులో తమ పేర్లు లేవంటూ రెవెన్యూ కార్యాలయం ముందు కొందరు బాధితులు నిరసన తెలియజేశారు. పోలింగ్ సమయంలో ఇలా వందలాది మందికి ఓట్లు లేవన్న విషయం బయటపడడంతో కలకలానికి కారణమైంది.