Telangana: తెలంగాణలో చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు చెబుతున్నారో తెలుసా?: వైఎస్ జగన్

  • వైఎస్ హయాంలో నిర్మించినవీ చంద్రబాబే కట్టించారట
  • ఐటీ రంగం పరుగులు తీసింది వైఎస్ హయాంలో కాదా?
  • నాడు బాబు హయాంలో ఐటీ రంగంలో వృద్ధి రేటు 8 శాతమే 
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఏ స్థాయిలో అబద్ధాలు చెప్పారో తెలుసా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన మాట్లాడుతూ, శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నర్సింహారావు ఫ్లై ఓవర్ ను నిర్మించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అయితే, తన హయాంలో అని చంద్రబాబు చెప్పుకుంటున్నారని విమర్శిం చారు. హైదరాబాద్ లో ఐటీ రంగం పరుగులు తీసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కాదా? చంద్రబాబు హయాంలో ఐటీ రంగంలో వృద్ధి రేటు 8 శాతమైతే, ఇదే రంగంలో వైఎస్ హయాంలో వృద్ధి రేటు 14 శాతం కాదా? అని ప్రశ్నించారు.
Telangana
Chandrababu
ys jagan
Telugudesam
ysrcp

More Telugu News