Balakrishna: బాలకృష్ణ ఎవరో నిజంగా తెలియదు.. పవన్ కంటే నా ఫాలోయింగ్ 100 రెట్లు ఎక్కువ: కేఏ పాల్

  • హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదు
  • బాబు సీఎం కాకముందే నేను అభివృద్ధి చేశా
  • బాలకృష్ణ యాక్టరా? అని అడిగా..
  • పవన్ మాట్లాడితే 5-10 వేల మందే చూశారు
బాలకృష్ణ ఎవరో తనకు నిజంగానే తెలియదని కేఏ పాల్ వెల్లడించారు. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది చంద్రబాబు కాదని.. ఆయన ముఖ్యమంత్రి కాకముందే తాను అభివృద్ధి చేశానని హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన చెప్పారు. శాంతి సభలు పెట్టుకునేందుకు తనకు చంద్రబాబు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు.

వారం క్రితం ఓ ఛానల్‌లో మాట్లాడుతూ ‘బాలకృష్ణ ఎవరో తెలియదు. ఆయన యాక్టరా? అని అడిగా. యూట్యూబ్‌లో ఆ వీడియోను 14 లక్షల మంది చూశారట కానీ అది నిజం’ అని తెలిపారు. అయితే అదే ఛానల్‌లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడితే మాత్రం 5 నుంచి 10 వేల మంది మాత్రమే చూశారని అన్నారు. దీనిని బట్టి పవన్ కంటే తన ఫాలోయింగ్ 100 రెట్లు ఎక్కువని కేఏ పాల్ స్పష్టం చేశారు.
Balakrishna
KA Paul
Pawan Kalyan
Chandrababu
Hyderabad

More Telugu News