జగన్ @ 3,390 కిలోమీటర్లు.. శ్రీకాకుళంలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప యాత్ర!
- ఈరోజు ఉదయం రెడ్డిపేటలో ప్రారంభం
- ప్రజలను కలుసుకుంటూ ముందుకెళుతున్న జగన్
- చిలకలపాలెంలో సాయంత్రం బహిరంగ సభ

అనంతరం ఎచ్చెర్ల వద్ద రాత్రికి విశ్రాంతి తీసుకోనున్నారు. జగన్ ను కలుసుకునేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కాగా, పాదయాత్రకు ముందు భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జగన్ తో పాటు వైసీపీ నేతలు ఆయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,390.3 కిలోమీటర్లు నడిచారు.