ఓటరు స్లిప్ అందలేదా...డోంట్ వర్రీ!: ‘నా ఓటు’, ‘మై జీహెచ్ఎంసీ’ యాప్ ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు!
- హైదరాబాద్ జిల్లాలో 40.6 లక్షల మంది ఓటర్లు
- చిరునామా సరిగా లేక, బీఎల్ఓలు గుర్తించక 6 లక్షల మందికి అందని చీటీలు
- ప్రత్యామ్నాయ యాప్‌ను వినియోగించుకోవాలని ఎన్నికల అధికారి సూచన
బీఎల్ఓలు గుర్తించలేకపోవడం, స్లిప్‌లో అడ్రస్ సరిగా లేకపోవడం వంటి కారణాలతో హైదరాబాద్ జిల్లాలోనే 15 శాతం మంది ఓటర్లకు స్లిప్‌లు అందలేదు. జిల్లాలో మొత్తం 40 లక్షల 57 వేల 488 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 6 లక్షల మందికి చీటీలు పంపిణీ చేయలేకపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఓటు ఒక చోట ఉండడం, నివాసం మరో చోటికి మారడం, ప్రాంతం గుర్తించలేకపోవడం వంటి కారణాలతో చీటీలు అందించలేకపోయారు. ఇటువంటి వారంతా తమ స్మార్ట్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని ఓటరు స్లిప్ పొందవచ్చునని ఎన్నికల అధికారి సూచించారు.