కేసీఆర్.. దమ్ముంటే యువత, రైతులు, అమరవీరుల కుటుంబాలను దత్తత తీసుకో!: రాహుల్ గాంధీ
- నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ వచ్చింది
- నల్లగొండను దత్తత తీసుకుంటానని కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు
- కోదాడ సభలో మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ చీఫ్
నిజంగా కేసీఆర్ కు దమ్ముంటే రాష్ట్రంలోని రైతులను తొలుత దత్తత తీసుకోవాలనీ, వాళ్లు బలవన్మరణానికి పాల్పడకుండా కాపాడాలని సూచించారు. నిరుద్యోగ యువతను దత్తత తీసుకుని ఉపాధి కల్పించాలని కోరారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ఏకంగా 4,500 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని విమర్శించారు. దళితులకు మూడెకరాల భూమి, ఎస్టీలకు రిజర్వేషన్లు, యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమైన కేసీఆర్.. బడా కాంట్రాక్టర్లకు మాత్రం భారీగా సాయపడ్డారని దుయ్యబట్టారు.