ఎన్నికల రోజు సెలవుందా? లేదా?: అయోమయంలో లక్షలాది మంది ఉద్యోగులు!
- ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవు
- ప్రైవేటు రంగంలో ఇంకా రాని స్పష్టత
- సెలవు కావాలంటున్న ఉద్యోగులు
దీంతో తాము స్వగ్రామాలకు వెళ్లి ఓటు వేసి రాగలమా? అని ఉద్యోగులు మధనపడుతున్నారు. కొన్ని కంపెనీలు శుక్రవారం నాడు సెలవు ప్రకటించి, రెండో శనివారమైన 8వ తేదీన విధులకు హాజరు కావాలని ఆదేశించాయి. దీంతో కుటుంబ సమేతంగా ఊరికి వెళ్లి, ఒక్క రోజులో ఎలా తిరిగి రావాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలూ సెలవు ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు.