పోలింగ్ ముగిసే వరకు డ్రై డే.. మద్యం తాగి పోలింగ్ స్టేషన్‌కు వస్తే..!
- పోలింగ్ కేంద్రాల వద్ద ధూమపానం నిషేధం
- మద్యం తాగి వస్తే అరెస్టే
- అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష
ఇక, నేటి సాయంత్రంతో ప్రచార పర్వం ముగియనుండడంతో ఆ తర్వాత రాజకీయ పార్టీలు ఏవీ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎక్కడా, ఏ రూపంగానూ ప్రచార ప్రకటనలను ప్రసారం చేయరాదని తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. అలాగే, ప్రజల దృష్టిని ఆకర్షించే కార్యక్రమాలు కూడా చేపట్టరాదన్నారు. ఎన్నికల నిబంధనలను తప్పకుండా పాటించాల్సిందేనని, అతిక్రమిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదంటే రెండూ అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు.