Rahul Gandhi: రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ట్విట్టర్లో స్పందించిన రాహుల్ గాంధీ!

  • ట్విట్టర్లో స్పందించిన రాహుల్ గాంధీ 
  • టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి
  • కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు
రేవంత్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో స్పందించారు. ఈ మేరకు కేసీఆర్‌ ని విమర్శిస్తూ రేవంత్ రెడ్డితో కలిసి ఉన్న ఓ ఫోటోని జత చేసి ట్వీట్ చేశారు.

'అరెస్టులతో కాంగ్రెస్‌ ప్రభంజనాన్ని టీఆర్‌ఎస్‌ అడ్డుకోలేదు. కేసీఆర్‌ నిరంకుశ ధోరణికి పరాకాష్టే రేవంత్‌రెడ్డి అరెస్ట్‌. టీఆర్‌ఎస్‌ ప్రజా వ్యతిరేక పాలనకు రోజులు దగ్గర పడ్డాయి. ఓటమి భయం వల్లే అరెస్ట్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ను ప్రజలు చిత్తుగా ఓడించి కేసీఆర్‌కు విశ్రాంతి ఇవ్వబోతున్నారు' అంటూ రాహుల్ తన ట్వీట్ లో వ్యాఖ్యానించారు.
Rahul Gandhi
Revanth Reddy
KCR
TRS
Congress
Telangana

More Telugu News