Chandrababu: చంద్రబాబు చమత్కారాలు తెలుసుగా!.. ఓ బూటకపు సర్వే ఇస్తాడు జాగ్రత్త!: సీఎం కేసీఆర్

  • అది బూటకపు సర్వే.. ఏమాత్రం పట్టించుకోవద్దు
  • 98 నుంచి 108 సీట్ల మధ్య మనం గెలవబోతున్నాం
  • మళ్లీ చంద్రబాబు పెత్తనం అవసరమా?
మక్తల్ నియోజకవర్గంలో తమ అభ్యర్థి రామ్మోహన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రతిపక్ష అభ్యర్థి తిరిగి చూడాలన్నా భయపడేలా ఆ గెలుపు ఉండాలంటూ సీఎం కేసీఆర్ ఉత్సాహపరిచారు. మక్తల్ నియోజకవర్గంలో నిర్వహించిన టీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఈరోజు నేను చెబుతున్నా. 98 నుంచి 108 సీట్ల మధ్య మనం గెలవబోతున్నాం. ఎవరూ ఆపేది లేదు.

కానీ, చంద్రబాబు చమత్కారాలు తెలుసుగా! ఓ డూప్లికేట్ సర్వే ఇవాళ సాయంత్రం ఇస్తాడు చూడండి! అదంతా లంగ సర్వే, బూటకపు సర్వే. ఏమాత్రం పట్టించుకోవాల్సిన, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అటువంటి గోల్ మాల్, గజకర్ణ, గోకర్ణ, టక్కుటమారా విద్యలు చేసి, డబ్బు సంచులు తెస్తున్నారు. నిన్న వరంగల్ పోలీసులు ఆరు కోట్లు పట్టుకున్నారు. చంద్రబాబుకు రాష్ట్రం లేదా? తెలంగాణలో మళ్లీ చంద్రబాబు పెత్తనం అవసరమా? అవసరం లేదన్న విషయాన్ని ఓటు దెబ్బతో చూపించాలి’ అని మండిపడ్డారు.
Chandrababu
kcr
maktal
TRS
Telugudesam

More Telugu News