మాకు 580 ఎకరాల పొలం ఉండేది.. నేను పుట్టిన ఇల్లు విస్తీర్ణమే మూడెకరాలు ఉండేది!: సీఎం కేసీఆర్
- ఇప్పుడేమో 600 గజాల ఇంట్లో ఉంటున్నా
- రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నాను
- చంద్రబాబు చెత్త రాజకీయాలు చేస్తారు
‘తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ నగదు వరద పారిస్తున్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలపై స్పందిస్తూ.. ఆంధ్రాలో అక్రమంగా సంపాదించిన సొమ్మును చంద్రబాబే భారీగా వెదజల్లుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆంధ్రా, తెలంగాణలో ఏ ఒక్కరిని అడిగినా చెబుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ 95-107 స్థానాలతో అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు. బంగారు తెలంగాణ టీఆర్ఎస్ తోనే సాధ్యమనీ, మహాకూటమికి ఓటువేస్తే తెలంగాణ చీకటిగా మారిపోతుందని హెచ్చరించారు.