HySis: గత వారం అంతరిక్షంలోకి వెళ్లిన 'హైసిస్' పంపిన తొలి చిత్రం ఇదిగో!

గత నెల 29న భారత అంతరిక్ష సంస్థ నింగిలోకి పంపిన భూ ఉపరితల పర్యవేక్షణ ఉపగ్రహం 'హైసిస్‌' తాను తీసిన తొలి చిత్రాన్ని పంపించింది. దీంతో సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి పీఎస్‌ఎల్వీ - సీ43 ద్వారా నింగిలోకి చేరిన 'హైసిస్‌' తన తొలి అడుగును విజయవంతంగా వేసినట్లయింది.

ఈ శాటిలైట్ గుజరాత్‌ లోని లఖ్‌ పేట్‌ పరిసరాలను చిత్రీకరించింది. ఈ చిత్రాన్ని ఇస్రో విడుదల చేసింది. ఉపగ్రహం పంపే చిత్రాలతో వ్యవసాయం, నేలసార పరీక్షలు, పర్యావరణ నియంత్రణ తదితరాలకు సంబంధించి నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ చేసే కృషికి ఎంతో సహకారం లభిస్తుందని పేర్కొంది. ఈ చిత్రం చాలా క్లారిటీతో ఉందని పేర్కొంది. కాగా, ఈ శాటిలైట్, భూ ఉపరితలంపై ఉన్న పరారుణ, విద్యుదయస్కాంత వలయాన్ని కూడా ఛేదించి చిత్రాలు తీయగలదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
HySis
Satilite
Picture
Gujarath

More Telugu News