Chandrababu: చంద్రబాబు తరపున రాజకీయాల్లో నటిస్తున్న పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్: వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి

  • పవన్ కల్యాణ్ కు ఎటువంటి సిద్ధాంతాలూ లేవు
  • డబ్బు తీసుకోవడం, నటించడం మాత్రమే ఆయనకు తెలుసు
  • టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల భాగస్వామి పవన్
చంద్రబాబు తరపున రాజకీయాల్లో నటిస్తున్న పెయిడ్ ఆర్టిస్ట్ పవన్ కల్యాణ్ అని అనంతపురం వైసీపీ నాయకుడు అనంత వెంకట్రామిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ కు ఎటువంటి సిద్దాంతాలూ లేవని, డబ్బు తీసుకోవడం, నటించడం మాత్రమే ఆయనకు తెలుసని విమర్శించారు.

అనంతపురంలో పవన్ నిన్న పర్యటించడంపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తమ అధినేత జగన్ ని విమర్శించేందుకే పవన్ కవాతు నిర్వహించారని దుయ్యబట్టారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాల భాగస్వామి పవన్ కల్యాణ్ అని ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయించాల్సిన బాధ్యత పవన్ పై లేదా? అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును పవన్  కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.  
Chandrababu
Jagan
Pawan Kalyan
YSRCP

More Telugu News