TRS: నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ఎందుకు ప్రకటించట్లేదు?: రేవంత్

  • కాంగ్రెస్ లీగల్ సెల్ ఫిర్యాదు
  • 500 రెట్లు అదనంగా ఖర్చు చేశారు
  • అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలి
కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిపై కాంగ్రెస్ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. కొడంగల్‌లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు నేడు  ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇప్పటికే నరేందర్ రెడ్డి 500 రెట్లు అదనంగా ఖర్చు చేశారని.. అయినా ఎందుకు అనర్హుడిగా ప్రకటించడం లేదంటూ కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్‌రెడ్డి రిటర్నింగ్‌ అధికారిని ప్రశ్నించారు.

నరేందర్‌రెడ్డి ఫాంహౌ‌స్‌పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించి రూ.17.51 కోట్లు స్వాధీనం చేసుకుంటే, రూ.51 లక్షలు సీజ్‌ చేసినట్లు అధికారులు ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఐటీ దాడుల్లో రూ.4.46 కోట్లు ఖర్చు చేసినట్లుగా తేలిందని, ఇవే కాకుండా మద్యం ఖర్చులు అదనమని రేవంత్‌రెడ్డి తెలిపారు. వెంటనే నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
TRS
Narender Reddy
Revanth Reddy
Returning Officer

More Telugu News