Rahul Gandhi: కాంగ్రెస్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన జగన్!

  • చంద్రబాబు పాలన అవినీతిమయమని కాంగ్రెస్ అనలేదా?
  • ‘చార్జ్ షీట్’ పేరిట పుస్తకం కూడా ఇటీవల విడుదల చేసింది
  •  తెలంగాణ ఎన్నికల కోసం సిగ్గు లేకుండా జత కట్టారు
నాలుగేళ్ల చంద్రబాబు పాలన అవినీతిమయం అంటూ నాలుగైదు నెలల క్రితం ‘చార్జ్ షీట్’ అనే పుస్తకాన్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిందని, ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల కోసం చంద్రబాబుతో సిగ్గు లేకుండా జతకట్టిందని వైసీపీ అధినేత జగన్ నిప్పులు చెరిగారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, వీరి రాజకీయాలు ఇంత దారుణంగా ఉన్నాయని విమర్శించారు.

టీడీపీ-టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తే బాగుంటుందని చంద్రబాబు తనను అడిగినట్టు కేటీఆర్ చెప్పిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. అందుకు కుదరదని కేటీఆర్ చెప్పడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీతో బాబు డీల్ కుదుర్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబు అవినీతి సొమ్ము ఇస్తాననగానే కాంగ్రెస్ వాళ్లు అందుకు ఒప్పుకున్నారని ఆరోపించారు.

ఒకవేళ, టీడీపీతో కలిసి పోటీ చేయడానికి టీఆర్ఎస్ ఇష్టపడినట్టయితే, కాంగ్రెస్ పార్టీపై చంద్రబాబు దుమ్మెత్తిపోసేవారు కాదా? అని ప్రశ్నించారు. ఇటువంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ‘చక్రం తిప్పుతున్నాను’ అని తనకు తానుగా చెప్పుకుంటున్నారని, ఇంతకన్నా దిక్కుమాలినతనం ఇంకేమైనా ఉందా? అని ప్రశ్నించారు.
Rahul Gandhi
Chandrababu
jagan
Srikakulam District

More Telugu News