kcr: టీఆర్ఎస్ గెలుస్తుందని 12 జాతీయ స్థాయి సర్వేలు తెలిపాయి: కేసీఆర్

  • ఇప్పటి వరకు వచ్చిన సర్వేలన్నీ మనకే అనుకూలంగా వచ్చాయి
  • ప్రధాని స్థాయి వ్యక్తి కూడా అబద్ధాలు మాట్లాడే దేశం మనది
  • ఎన్నికల తర్వాత ఢిల్లీకి వెళ్లి బీజేపీ, కాంగ్రెస్ లను చెండాడుతా
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఇప్పటివరకు వచ్చిన సర్వేలన్నీ మనకే అనుకూలంగా వచ్చాయని... టీఆర్ఎస్ గెలుస్తుందని 12 జాతీయ స్థాయి సర్వేలు చెప్పాయని అన్నారు. మధిరలో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజలే గెలవాలని చెప్పారు.

ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి కూడా పచ్చి అబద్ధాలు మాట్లాడే దేశం మనదని ఆయన అన్నారు. తాను రాహుల్ గాంధీ ఏజెంట్ నని మోదీ అన్నారని మండిపడ్డారు. తాను ఎవరికీ ఏజెంట్ ను కాదని... తెలంగాణ ప్రజలకే తాను ఏజెంట్ నని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఢిల్లీకి వెళ్లి హిందీలో బీజేపీ, కాంగ్రెస్ లను చీల్చి చెండాడుతానని అన్నారు. రాహుల్ గాంధీ తోక గాంధీ అని... మనకు కావాల్సింది తోక గాంధీలు కాదని ఎద్దేవా చేశారు.
kcr
Rahul Gandhi
modi
TRS
bjp
congress
madhira

More Telugu News