cm chandrababu: యువకులను ప్రోత్సహించేందుకే ఇక్కడికి వచ్చా: సీఎం చంద్రబాబు

  • తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి
  • ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు మా ప్రయత్నం
  • భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారు
యువకులను ప్రోత్సహించేందుకే హైదరాబాద్ వచ్చానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. రాంనగర్ లో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన చంద్రబాబు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్నదే తమ ప్రయత్నమని అన్నారు.

 భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయాలు చేస్తున్నారని, మాయమాటలు చెప్పి రెచ్చగొట్టాలని చూస్తే కుదరదని టీఆర్ఎస్ ను పరోక్షంగా హెచ్చరించారు. తెలంగాణలో అభివృద్ధి ఆగిపోయిందని, అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరడం లేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరిన చంద్రబాబు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తానని చెప్పారు.
cm chandrababu
Telugudesam
Hyderabad
road show

More Telugu News