రూ.200 కోట్ల క్లబ్‌లో ‘2.ఓ’.. మరో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్న రజనీ

  • మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్
  • తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్లు
  • హిందీ వర్షనే రూ.63.25 కోట్లు వసూలు
‘2.ఓ’ ఊహించినట్టుగానే బాక్సాఫీస్ దుమ్ము దులిపేస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా తొలిరోజే పేరు తెచ్చుకుంది. దీంతో తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లు వసూలు చేసింది. ఒక్క హిందీ వర్షనే రూ.63.25 కోట్లు వసూలు చేసినట్టు తరుణ్ ఆదర్శ్ తెలిపారు.

వీకెండ్ కూడా కావడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది. రెండో రోజుతో పోల్చితే మూడో రోజు వసూళ్లు 23.46 శాతం పెరిగినట్టు పేర్కొన్నారు. రజనీకాంత్ మరో రికార్డ్ కూడా సాధించారు. ఆయన నటించిన రోబో, కబాలి చిత్రాలు కూడా రూ.200 కోట్లకు పైగా వసూలు చేశాయి. దక్షిణాదిలో రూ.200 కోట్లు రాబట్టిన మూడు సినిమాలున్న కథానాయకుడుగా రజనీ సరికొత్త రికార్డ్ సొంతం చేసుకున్నారు.
Go Back to Shorts
2.0
Rajinikanth
Akshay kumar
Ami Jackson
Visual Wonder

More Telugu News