పెళ్లయిన వెంటనే వరుడు మాయం.. అసలు విషయం తెలుసుకుని షాకైన బంధువులు
- బాంద్రా కోర్టులో వివాహం చేసుకున్న అజయ్
- ఊరేగింపు వేడుకలో అజయ్, అల్తాఫ్ మాయం
- సెల్‌ఫోన్ దొంగలుగా గుర్తించి అరెస్ట్
ఆ వివరాల్లోకి వెళితే, సోమవారం ఉదయం రోడ్డు పక్కన నడుస్తున్న ఓ మహిళ నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు రూ.10 వేల విలువైన మొబైల్‌ను లాక్కెళ్లారు. వెంటనే సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు నిర్వహించిన పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులు అజయ్, అల్తాఫ్లుగా గుర్తించి పెళ్లి ఊరేగింపులోనే అరెస్ట్ చేశారు. వీరిపై గతంలో కూడా ఇలాంటి కేసే నమోదైందని సబ్ ఇన్స్పెక్టర్ బైల్ తెలిపారు.