పెళ్లి వేడుకలో విషాదం.. ముగ్గురి మృతి.. 250 మందికి అస్వస్థత
- ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్‌లో పెళ్లి వేడుక
- స్పందించిన ముఖ్యమంత్రి త్రివేద సింగ్
- పెరుగు కలుషితమైనట్టు పోలీసుల వెల్లడి
ఈ విషాద ఘటనపై నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విందులో వడ్డించిన పెరుగు కలుషితమైనట్టు తెలిసినట్టు పోలీసులు తెలిపారు. దీనిపై పూర్తి విచారణ నిర్వహిస్తున్నట్టు, చనిపోయిన వారిలో ఓ మహిళ, పదేళ్లలోపు ఇద్దరు పిల్లలున్నట్టు పోలీసులు చెప్పారు. బాధితులందరినీ బేరినాగ్, బాగేశ్వర్, అల్మోరా, కాప్‌కాట్, హల్ద్వానీ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు తరలించినట్టు పేర్కొన్నారు.