ఖానాపూర్ స్పెషాలిటీ: ఆమెపై... గతంలో కొడుకు.. ఇప్పుడు తండ్రి పోటీ!
- ఇది టీఆర్ఎస్ సిటింగ్ స్థానం
- తాజా మాజీ ఎమ్మెల్యేపై గత ఎన్నికల్లో టీడీపీ తరపున రితేష్ రాథోడ్ పోటీ
- ఈ ఎన్నికల్లో ఆమెపై రితేష్ తండ్రి రమేష్ రాథోడ్ కాంగ్రెస్ తరపున పోటీ
ఆ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేఖానాయక్‌కు గత ఎన్నికల్లో ప్రత్యర్థిగా రితేష్ రాథోడ్ నిలవగా, ఈ ఎన్నికల్లో ఆయన తండ్రి రమేష్ రాథోడ్ బరిలో ఉండడం విశేషం. మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఈ నియోజకవర్గంలో అసలు పోరు మాత్రం రేఖానాయక్, రమేష్ రాథోడ్ మధ్యే నెలకొంది.
మాజీ ఎంపీ అయిన రమేష్ రాథోడ్ 2014లో జరిగిన ఎన్నికల్లో బరిలో నివలేదు. ఆ ఎన్నికల్లో ఆయన కొడుకు రితేష్ రాథోడ్ టీడీపీ అభ్యర్థిగా రేఖానాయక్‌తో పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో రేఖానాయక్ దాదాపు 38 వేల ఓట్ల మెజార్టీతో విజయాన్ని కైవసం చేసుకున్నారు. కాగా, ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఏకంగా రమేష్ రాథోడ్ బరిలో ఉండడం విశేషం.