విభిన్న పంచాంగాలకు స్వస్తి.. పండుగల్లో గందరగోళానికి చెక్.. ఈ ఏడాది నుంచే అమలు
- ఇక భేదాభిప్రాయాలకు చెక్
- అందరూ కలిసి ఒకే ఒకే పంచాంగాన్ని రూపొందించాలని నిర్ణయం
- మరోమారు సమావేశం కానున్న పంచాంగకర్తలు
ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం, దేవాదాయ శాఖ, ప్రధాన ఆలయాలు వేర్వేరుగా పంచాంగాలు రూపొందిస్తున్నాయి. పండుగల విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా తేదీలను నిర్ణయిస్తుండడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతోంది. చివరికి వారి విచక్షణతోనే పండుగ జరుపుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా దేవాదాయ శాఖ, టీటీడీ మధ్య తరచూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఇకపై ఈ భిన్నాభిప్రాయాలకు ఫుల్స్టాప్ పెట్టి అందరూ కలిసి ఒకే పంచాంగాన్ని రూపొందించాలని నిర్ణయించారు. వచ్చే ఏడాది రానున్న వికారినామ సంవత్సరం నుంచే కొత్త పంచాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు.